Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం : అంబటి రాంబాబు

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (14:33 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువంటూ ఏదీ లేదన్నారు. పైగా, ఏ ప్రాజెక్టు అయినా దశలవారీగానే పూర్తవుతుందని మంత్రివర్యులు సెలవిచ్చారు. 
 
ఆయన బుధవారం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ హయాంలో జరిగిన చారిత్రాత్మక తప్పిదం కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిందని మంత్రి తేల్చిపారేశారు. పైగా, ఈ డయాఫ్రం వాల్ ఎవరివల్ల దెబ్బతిందో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, గత ప్రభుత్వంలో జలవనరుల శాఖామంత్రిగా పని చేసిన దేవినేని ఉమామహేశ్వర రావులు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. ఇంజనీర్లు, మేథావులు, మీడియా  సమక్షంలో ఈ చర్చ జరగాల్సివుందన్నారు. కాపర్ డ్యాం కట్టడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments