Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిపై వచ్చే నెలలో క్లారిటీ... మంత్రి నారాయణ

Webdunia
బుధవారం, 30 జులై 2014 (19:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై వచ్చే నెల చివరికి స్పష్టత వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. అనంతపురం జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐటీ స్థల పరిశీలనకు ఆయన జిల్లాలో పర్యటన పర్యటించారు. మంత్రులు నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు శింగనమల నియోజవర్గంలోని రెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. 
 
ఎన్ఐటీకి అనువైన ప్రభుత్వ భూములను వారు సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ఐటీ కోసం మూడు స్థలాలను పరిశీలించామని, వాటి వివరాలను రేపు శివరామ క్రిష్ణన్ కమిటీకి అందజేస్తామన్నారు. రాష్ట్ర రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఆగష్టు 20 లోపు నివేదిక ఇస్తుందన్నారు.
 
కమిటీ నివేదిక తర్వాత రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. అదేవిధంగా తెలంగాణా ప్రభుత్వంతో స్నేహ పూర్వకంగానే ముందుకెళ్తామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల భద్రత దృష్ట్యా, సమస్యల పరిష్కారం దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్నేహపూర్వకంగానే ముందుకెళ్తారని మంత్రి నారాయణ తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments