Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మారిటైమ్ పాలసీ రిలీజ్... నోడెల్ ఏజెన్సీగా మారిటైమ్ బోర్డు

ఠాగూర్
గురువారం, 12 డిశెంబరు 2024 (09:03 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మారిటైమ్ పాలసీని విడుదల చేసింది. 2024-29 సంవత్సరానికిగాను ఈ పాలసీని విడుదల చేసింది. మారిటైమ్ పాలసీ అమలుకు నోడెల్ ఏజెన్సీగా మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, లాజిస్టిక్స్, ఇతర మారిటైమ్ సేవలు అందించేలా నూతన పాలసీని రూపొందించారు. ఏపీ మారిటైమ్ విజన్‍‌ను ఆవిష్కరించటంతో పాటు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది.
 
సుదీర్ఘమైన తీర ప్రాంతం, పోర్టులు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించేలా విధాన రూపకల్పన చేసింది. 2030 నాటికి భారత మారిటైమ్ గేట్ వేగా ఏపీని మార్చేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టింది. కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాలను పెంపొందించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. ప్రపంచంలోని 20 భారీ పోర్టుల్లో ఒకటి ఏపీలో ఉండే విధంగా సామర్థ్యం పెంపు లక్ష్యంగా ఈ పాలసీ రూపొందించింది.
 
2047 నాటికి దేశంలోని పోర్టుల్లో నిర్వహిస్తున్న మొత్తం కార్గోలో 20 శాతం ఏపీలోనే నిర్వహించేలా కార్యాచరణ చేపట్టింది. అలానే పోర్టుకు సంబంధిత వ్యవహారాల్లో 5 వేల మంది నిపుణులను 2028 నాటికల్లా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మారిటైమ్ పాలసీ అమలుకు ఏపీ మారిటైమ్ బోర్డును నోడల్ ఏజన్సీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun politics: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. పీకేతో భేటీ.. బన్నీ టీం క్లారిటీ

నా కంటికి తగిలితే నేను గుడ్డివాడినయ్యేవాడిని : మోహన్ బాబు (video)

పుష్ప 2: విజయం నాది మాత్రమే కాదు, మన దేశ విజయం : అల్లు అర్జున్

అసామాన్యుడి వీర విప్లవ కథే విడుదల-2 : నిర్మాత చింతపల్లి రామారావు

అల్లు అర్జున్‌తో హీరో సిద్ధార్థ్‌కు సమస్యలా? 'పుష్ప-2'పై అలాంటి కామెంట్స్ ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

High blood pressure అధిక రక్తపోటు వున్నవారు ఏం తినకూడదు?

Fruits burn Belly fat, బెల్లీ ఫ్యాట్ కరిగించే పండ్లు, ఏంటవి?

అంతర్జాతీయ ఫర్నిచర్, డెకర్ ఉత్పత్తులపై రాయల్ఓక్ ఫర్నిచర్ 70 శాతం వరకు తగ్గింపు

తర్వాతి కథనం