అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

ఠాగూర్
మంగళవారం, 7 అక్టోబరు 2025 (08:12 IST)
ఏపీలోని విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో జరిగిన విజయదశమి పండుగ సందర్భంగా అమ్మవారికి వేడుకలు నిర్వహించారు. ఇందులో తన భార్యతో కలిసి డ్యాన్స్ వేసిన భర్త.. కొన్ని క్షణాల్లోనే అనంతలోకాలకు చేరుకున్నాడు. ఈ విషాదకర ఘటన పెందుర్తిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పెందుర్తి మండలంలోని పెదగాడి గ్రామానికి చెందిన అప్పికొండ త్రినాథ్ (56) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు భార్య లక్ష్మీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకల్లో తన భార్య లక్ష్మీతో కలిసి త్రినాథ్ నృత్యం చేశాడు. పాట పూర్తయిన వెంటనే త్రినాథ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
 
దీంతో గ్రామస్థులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, త్రినాథ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో పండుగ వేళ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, డీజే శబ్దాలకు త్రినాథ్ గుండె ఆగివుంటుందని గ్రామస్థులు అనుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vanara: సోషియో ఫాంటసీ కథతో అవినాశ్ తిరువీధుల మూవీ వానర

Akhanda 2: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్

Sapthami Gowda: సతీష్ నినాసం హీరోగా ది రైజ్ ఆఫ్ అశోక నుంచి పాట విడుదల

Renu Desai: రేణు దేశాయ్ నటిస్తున్న సినిమా 16 రోజుల పండగ

Samantha: యూఎన్ విమెన్‌ ఇండియాతో చేతులు కలిపిన సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments