Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో టెన్త్ - ఇంటర్ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే..?

ఠాగూర్
గురువారం, 12 డిశెంబరు 2024 (14:47 IST)
విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ తాజాగా విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు వచ్చే యేడాది మార్చి 17వ తేదీ నుంచి, ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 
 
టెన్త్ పరీక్షలు మార్చి 17 నుంచి మార్చి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. 
 
ఇంటర్‌లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.
 
ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
 
టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. "డియర్ స్టూడెంట్స్... ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజైంది. పరీక్షలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధం కండి. ఒత్తిడిని దరిచేరనివ్వవద్దు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. పరీక్షలను మీ శక్తిమేర రాయండి. అందరూ చక్కగా చదివి పాసవ్వాలని కోరుకుంటున్నాను" అంటూ ఇంటర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments