Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలైలోనే కచ్చితంగా పరీక్షలుంటాయని చెప్పట్లేదు.. విద్యాశాఖ మంత్రి

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (18:06 IST)
ఇంటర్ పరీక్షలు బహుశా జులై మొదటివారంలో జరగొచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. జులై చివరి వారంలో టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉందని చెప్పారు. జులైలో పరీక్షలు నిర్వహించలేకపోతే ఇక అవకాశం ఉండదని భావిస్తున్నామని మంత్రి ఆదిమూలపు వ్యాఖ్యానించారు. పరీక్షలు రద్దు చేయడం అనేది తమకు ఎంతో సులభమైన పని అని, ఒక్క నిమిషంలో చేయగలమని తెలిపారు. కానీ తర్వాత పర్యవసానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
 
కేరళ, బీహార్ రాష్ట్రాలు విద్యార్థులకు పరీక్షలు జరిపాయని, చత్తీస్ గఢ్ కూడా పరీక్షలు జరుపుతోందని వెల్లడించారు. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని, క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, తాము కచ్చితంగా జులైలోనే పరీక్షలు పెడతామని చెప్పడంలేదని, అవకాశం ఉందని మాత్రమే చెబుతున్నామని వివరించారు. 
 
ప్రస్తుతం పరీక్షల నిర్వహణపై సమీక్షించుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని పరీక్షలు జరుపుతామని, కరోనా తప్పిస్తే పరీక్షలకు ఇంకేం అడ్డంకి ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments