Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరుగడ్డపై ఏపీ హైకోర్టు సీరియస్... గడువులోగా లొంగిపోకుంటే...

ఠాగూర్
మంగళవారం, 11 మార్చి 2025 (22:09 IST)
రౌడీ షీటర్, వైకాపా నేత బోరుగడ్డ అనిల్ కుమార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యంతర గడువు ముగిసేలోపు పోలీసులకు లేదా రాజమండ్రి అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పి మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ కుమార్‌కు హైకోర్టు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తుంది. 
 
న్యాయస్థానం నిబంధనల ప్రకారం మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ లొంగిపోవాలి. అయితే, ఆయన సాయంత్రం వరకు లొంగిపోలేదు. పైగా, తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను పొడగించాలని మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇచ్చిన గడువులోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని హెచ్చరించింది. చెన్నైలో ఉంటే విమానంలో అయినా వచ్చి లొంగిపోవాలని ఆదేశించింది. కానీ, ఆయన మాత్రం లొంగిపోలేదు. 
 
ఇదిలావుంటే, తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని, సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈ నెల 1వ తేదీన మధ్యంతర బెయిల్ గడువును బోరుగడ్డ అనిల్ పొడగించుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

దళపతి విజయ్ కి గ్రాండ్ వీడ్కోలు పలికే ప్రత్యేక పాట !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments