Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్షేమ పథకాల నిధుల విడుదల పిటిషన్లపై తీర్పు రిజర్వు!

ఠాగూర్
గురువారం, 9 మే 2024 (17:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేసేందుకు అనుమతివ్వాలంటూ సీఎం జగన్ సర్కారు ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరగా, ఈసీ పర్మిషన్ నిరాకరించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పథకాల నిధుల విడదల ఆపేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి.
 
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మరోసారి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ అభ్యంతరాలకు సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా... ఈసీ నేడు సమాధానం ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
 
కాగా, జనవరి - మార్చి మధ్యలో పథకాలకు బటన్లు నొక్కి అప్పుడే నిధులు విడుదల చేయకుండా, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎలా నిధులు విడుదల చేస్తారని గురువారం విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. సైలెంట్ పీరియడ్‌లో నిధుల విడుదలకు అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది. 
 
అందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది బదులిస్తూ... తామేమీ కొత్త పథకాలు ప్రకటించలేదని, ఎప్పటినుంచో నడుస్తున్న పథకాలకు మాత్రమే నిధులు విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు. అందుకు, ఈసీ తరపు న్యాయవాది స్పందిస్తూ... ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక జూన్ ఆరో తేదీన నిధులు విడుదల చేసుకోవాలని గతంలో తాము చెప్పామని, ఇప్పుడు పోలింగ్ పూర్తయ్యాక నిధులు విడుదల చేసుకోవచ్చని చెబుతున్నామని చెప్పడంతో కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments