Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు...

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (15:42 IST)
కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసును విచారిస్తున్న సీబీఐపై ఏపీ హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతోంది. దీంతో సీబీఐపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఈ కేసు విషయంపై హైకోర్టు ధర్మాసనం మంగళవారం అత్యవసరంగా విచారించింది. విచారణ సందర్భంగా స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీ కుమార్ మాట్లాడుతూ రిజిస్ట్రార్ జనరల్ నుంచి లెటర్ వచ్చిన వెంటనే యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి పంచ్ ప్రభాకర్ పోస్టును తొలగించి, బ్లాక్ చేశారని చెప్పారు. తాము కూడా లేఖ రాశామని సీబీఐ తెలిపింది. 
 
దీంతో ధర్మాసనం స్పందిస్తూ లేఖ రాయడం వల్ల ఉపయోగం ఏముందని ప్రశ్నించారు. పంచ్ ప్రభాకర్‍‌‌ను ఎలా పట్టుకుంటారో చెప్పాలని వ్యాఖ్యానించింది. సీబీఐ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చెప్పింది వినకపోతే... మీరు చెప్పేది కూడా మేము వినబోమని హైకోర్టు స్పష్టం చేసింది. 
 
పైగా, ఈ కేసులో ఏం చేయాలో తామే ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. పైగా, ఈ కేసును ఎలా డీల్ చేయాలో తమకు తెలుసని కోర్టు వ్యాఖ్యానించింది. మంగళవారం సాయంత్రాకల్లా తగు ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments