Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారుకు షాక్.. జీవో నెం.1 సస్పెండ్.. 20న తుది తీర్పు

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (17:03 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ నెల 20న తుది తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. 
 
ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీచేసిందని ఆయన పేర్కొన్నారు.
 
దీనిపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్దంగా ఉందని డివిజన్ బెంచ్ అభిప్రాయపడుతూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. కాగా, జీవో నంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ విపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments