Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైల్డ్ కేర్ లీవ్‌ను ఎపుడు వాడుకోవచ్చు... క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (16:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చైల్డ్ కేర్ సెలవుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ వేదికగా ఓ క్లారిటీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులు తమ చైల్డ్ కేర్ లీవ్‌ను వారి సర్వీసులో ఎపుడైనా వాడుకునే వెసులుబాటును కల్పించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ రెన్యువన్‌ కాల పరిమితిని మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్లకు పొడగించారు. 
 
ఏపీలోని మహిళా ఉద్యోగులకు 180 రోజుల చైల్డ్ కేర్ సెలవు ఉంది. దీన్ని సర్వీస్ కాలంలో ఎపుడైనా ఉపయోగించుకునే వెసులు బాటు కల్పించేందుకు సమ్మతం తెలిపారు. ప్రస్తుతం ఈ చైల్డ్ కేర్ లీవ్‌ను పిల్లలకు 18 యేళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే ఉయోగించుకోవాలన్న నిబంధన ఉంది. ఈ నిబంధనను ప్రభుత్వం సడలించింది. మహిళా ఉద్యోగులు తమ సర్వీసులో ఈ సెలవును ఎపుడైనా వినియోగించుకోవచ్చని తెలిపారు. 
 
అలాగే, ప్రైవేటు స్కూల్స్ రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్‌ను 3 యేళ్ల నుంచి 8 యేళ్ల వరకు పెంచాలని కోరగా దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments