Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో లాక్‌డౌన్ సడలింపు - మార్గదర్శకాలు జారీ

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (17:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా లాక్‌డౌన్ సడలించింది. కొన్ని రంగాల్లో ఈ లాక్డౌన్ సడలింపులో భాగంగా, అదనపు మార్గదర్శకాలు జారీచేసింది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి జగన్‌తో ఫోనులో మాట్లాడారు. అమిత్ షా సూచన మేరకు అదనపు మార్గదర్శకాలను రూపొందించారు. ఈ మార్గదర్శకాల మేరకు ఆయా రంగాలకు సంబంధించిన పనులు చేసుకునేందుకు అనుమతి లభించింది.  
 
ఈ సూచనల మేరకు ఆర్థిక రంగం, వ్యవసాయ రంగం, ఉద్యాన పనులకు, ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్,  గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు, పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు, ఈ-కామర్స్ కంపెనీలు, వారి వాహనాలకు, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, పుస్తక విక్రయ దుకాణాలు తెరిచేందుకు, కరోనా లక్షణాలు లేని వలస కార్మికులకు రాష్ట్ర పరిధిలోని సొంతూరులో పనిచేసుకోవచ్చు. మాల్స్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దుకాణాలు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు అనుమతి లభించింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments