Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలు మృతి పట్ల ఏపి గ‌వ‌ర్న‌ర్ సంతాపం

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (22:06 IST)
చెన్నైలోని ఓ ఆసుపత్రిలో సుదీర్ఘ  కాలంగా చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మృతి చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ మేర‌కు శుక్ర‌వారం రాజ్ భ‌వ‌న్ నుండి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గ‌వ‌ర్న‌ర్ హ‌రించంద‌న్  మాట్లాడుతూ బాల‌సుబ్రహ్మణ్యం కేవలం తెలుగు భాషలోనే కాకుండా దేశం మొత్తం మీద 16 భాషలలో నేపథ్య గాయకునిగా సంగీత అభిమానుల ప్రశంసలు అందుకున్నారని ప్రస్తుతించారు.

ప్రధానంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో ప్రతిభావంతమైన గాయకుడుగా పండిత, పామరులను అలరించారని పేర్కొన్నారు. దివంగత బాల సుబ్రహ్మణ్యం ఒక గాయకుడిగా 40వేల అత్యధిక పాటలను రికార్డ్ చేసినందుకు గిన్నిస్ రికార్డును కూడా కలిగి ఉన్నారని గుర్తు చేసుకున్నారు.

2011లో పద్మ భూషణ్ దక్కించుకోగా, ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 25 నంది అవార్డులు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం... ఇలా అనేక అవార్డులను అందుకున్నార‌ని తెలిపారు. బాలు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఈ సంద‌ర్భంగా బాలు కుటుంబ సభ్యులకు గ‌వ‌ర్న‌ర్ హృదయపూర్వక సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments