Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందు పంపిణీకి సహకరించని ప్రభుత్వం...

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (16:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన నాటు మందు వైద్యుడు ఆనందయ్య కరోనా బాధితులకు స్వస్థత చేకూర్చే నిమిత్తం ఓ మందును తయారు చేశారు. ఈ మందును తీసుకున్న అనేక మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ముఖ్యంగా చనిపోయే దశలో ఉన్నవారు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. 
 
ఈ క్రమంలో ఆనందయ్య మందును పంపిణీ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కానీ, కరోనా కోసం తాము తయారు చేస్తున్న మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆనందయ్య తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు బాధాకరమన్నారు. 
 
మందు పంపిణీకి సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ... సరైన స్పందన రాలేదని వాపోయారు. మందు తయారీకి సరైన సామగ్రి సమకూరకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, అందుకే మందు తయారీలో వెనుకబడ్డామని తెలిపారు. 
 
అయినా పలువురు దాతలు అందిస్తున్న సహకారంతో ప్రజలకు మందును అందిస్తున్నామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా మందును అందిస్తున్నామని తెలిపారు. బడ్డీ బంకుల్లో తమ మందును అమ్ముతున్నారని... అది ప్రభుత్వ లోపమేనన్నారు. 
 
అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా బాధితులందరికీ కరోనా మందును ఉచితంగా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో ప్రజాప్రతినిధుల ద్వారా మందును అందజేస్తున్నామని తెలిపారు. 
 
ఏయే జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయో... ప్రజాప్రతినిధులు, అధికారులు తెలుసుకుని తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని, ఆ సంఖ్యకు అనుగుణంగా మందును తయారు చేస్తామని ఆనందయ్య వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments