Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకం జాతీయ స్థాయిలో ఉత్త‌మం

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (13:00 IST)
ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన గృహ నిర్మాణ ప‌థ‌కం జాతీయ స్థాయిలోనే ఉత్త‌మ‌మైన ప‌థ‌కం అని ప్ర‌భుత్వ న్యాయ‌వాది వాదిస్తున్నారు. గృహ నిర్మాణంపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. దీనిపై హైకోర్టులో విచారణ జ‌రుగుతోంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకం జాతీయస్థాయిలో ఉన్న పథకం కంటే ఉత్తమమైనదిగా ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనను సింగిల్ జడ్జి పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో పలు లోపాలను హైకోర్టు ఎత్తిచూపింది. ప్రధానంగా మూడు అంశాలను కోర్టు ప్రస్తావించింది. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించింది. ఆ ప్రక్రియ ముగిసే వరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తీర్పు చెప్పింది. మహిళల పేరుతోనే పట్టాలివ్వడం సరికాదని, అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకూ ఇవ్వాలని చెప్పింది. ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్‌ కన్వేయన్స్‌ డీడ్‌లను రద్దు చేసి, అర్హులకు డీ-ఫాం పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
దీనికి కౌంట‌ర్ గా ప్ర‌భుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. సింగిల్ జ‌డ్జి దీనిని స‌రిగా అర్ధం చేసుకోలేక‌పోయార‌ని, ఏపీ ప్ర‌భుత్వం చేసిన ప‌థ‌కం జాతీయ స్థాయిలోనే మెరుగ‌యిన‌ద‌ని వాద‌న తెస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments