Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (08:40 IST)
పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భారీ వరద ప్రవాహం, నవయుగ కాంట్రాక్టర్ రద్దుతో పోలవరం పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ మొదటి వారం నుంచి పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగానే నూతన కాంట్రాక్టర్ ను పిలవాలని నిర్ణయించింది.

రివర్స్ టెండరింగ్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కార్.. ఈనెల 17న పోలవరంకు రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ ను విడుదల చేయనుంది. పోలవరం హెడ్‌వర్క్స్‌ తోపాటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అనుమతితో ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ చేపట్టనుంది.

ఇందులో ఎవరు తక్కువకు కోట్ చేస్తే వారికే పనుల కాంట్రాక్టు ఇవ్వనుంది. ఇటీవల పోలవరం పనులపై విచారించిన నిపుణుల కమిటీ రూ.3,128.31 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా నిర్థారించింది.

ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు రివర్స్‌ టెండరింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం వెళుతోంది. అందులో భాగంగా ప్రస్తుతమున్న కాంట్రాక్టర్ నవయుగను రద్దు చేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments