Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ: క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కారు

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (19:49 IST)
కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే వివిధ రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు నిబంధనల్ని కఠినతరం చేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ విధించారంటూ సోషల్ మీడియా వేదికగా కొన్నిరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నిన్నటి నుంచి వాట్సప్ గ్రూపుల్లో నైట్‌ కర్ఫ్యూ వార్త ట్రోల్ అవుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. నైట్‌ కర్ఫ్యూపై స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో ఏ విధమైన నైట్‌ కర్ఫ్యూ విధించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
సోషల్ మీడియా వేదికగా ఈ తరహా తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నవారి గురించి ఆరా తీస్తున్నామని తెలిపింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఇటువంటి వార్తల్ని నమ్మవద్దని వెల్లడించారు అధికారులు. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది. వాస్తవానికి జనవరి 8 నుంచి అంటే నేటి నుంచి నైట్‌ కర్ప్యూ విధిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments