Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మగడ్డ కేసులో కొత్త ట్విస్ట్ - ఆర్డర్స్ వెనక్కి... ఎస్ఈసీ కార్యదర్శిగా వాణీమోహన్

Webdunia
ఆదివారం, 31 మే 2020 (09:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా జి. వాణీమోహన్‌ను నియమిస్తూ అర్థరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఈమె ఇప్పటివరకు సహకార శాఖ కమిషనరుగా విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఈ మేరకు శనివారం అర్థరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
అలాగే, సహకార శాఖ కమిషనర్, ఏపీ డెయిరీ అభివృద్ధి సమాఖ్య ఎండీ, పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం జీవీఎస్ ప్రసాద్ ఎన్నికల కమిషన్‌ ఇన్‌చార్జ్ కార్యదర్శిగా ఉన్నారు. వాణీమోహన్ 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.
 
ఇదిలావుంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కేసులో మరో ట్విస్ట్ చేటుచేసుకుంది. హైకోర్టు తీర్పుతో ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టినట్టు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్టు ఎన్నికల కమిషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ తెలిపారు. 
 
శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్ 317ను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. 
 
అంతకుముందు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణియన్ మాట్లాడుతూ నిమ్మగడ్డ స్వీయ పునరుద్ధరణ చెల్లదని అన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్నారు. ఆ తర్వాత కాసేపటికే నుంచి మరో సర్క్యులర్‌ వెలువడింది. 

సంబంధిత వార్తలు

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments