Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఠాగూర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (13:16 IST)
హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప్-2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలివరకు తెచ్చారంటూ వ్యాఖ్యానించారు. 
 
సోమవారం మంగళవారం తెలంగాణ ఎఫ్.డి.సి చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు.
 
'తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి డైనమిక్ నేత. కిందిస్థాయి నుంచి ఎదిగారు. వైకాపా విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్‌షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్‌ ధర పెంపు అవకాశమిచ్చారు. అల్లు అర్జున్‌ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను. భద్రత గురించి వారు ఆలోచిస్తారు. 
 
థియేటర్‌ స్టాఫ్‌ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. సీట్లో ఆయన కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆ అరుపుల్లో ఆయనకు వినిపించలేదేమో. అల్లు అర్జున్‌ తరపున బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేది. చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారు. కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు' అని పవన్‌ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments