నోరు జారిన నారాయణ స్వామి.. జగన్‌పై దాడి చేసే రోజు రాబోతుందంటూ...

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (11:19 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నోరు జారారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసే రోజు త్వరలోనే రాబోతుందంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నాలిక కరుచుకుని.. పవన్ కళ్యాణ్‌పై దాడి చేసే రోజు రాబోతుందంటూ హెచ్చరించారు. 
 
ఇటీవల సాయిధరమ్ తేజ్ నటించిన "రిపబ్లిక్" ప్రీరిలీజ్ కార్యక్రమంలో హీరో పవన్ కళ్యాణ్ పాల్గొని ఏపీ ప్రభుత్వం వైఖరిని తూర్పారబట్టారు. ఏపీ మంత్రులను ఉతికి ఆరేశారు. దీంతో ఏపీ మంత్రులు కూడా అదేస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ మధ్యలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి రంగప్రవేశం చేశారు. పవన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా దూషించారు. 
 
తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను అనబోయి తమ ముఖ్యమంత్రినే అన్నారు. ప్రజలే జగన్మోహన్ రెడ్డిపైన దాడి చేసే రోజు రాబోతున్నది అంటూ నోరు జారారు. జగన్ ప్రజలపై దాడి చేయడం కాదు.. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు త్వరలో ఉన్నాయన్నారు. ఆ తర్వాత సీఎం జగన్ గురించి పొగుడుతూ వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పటికే ఆయన నోరు జారిన వ్యాఖ్యలు రికార్డు అయిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
నారాయణస్వామి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందచేసిన వస్త్రంతో సత్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments