Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెమిడెసివిర్ మందులు నిల్వచేసివుంటే ఉక్కుపాదమే : డీజీపీ

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (21:58 IST)
రెమిడిసివేర్  నిల్వలు - వినియోగం, ఆక్సిజన్ నిల్వలు - వినియోగం, ఫీజుల పేరిట దోపిడీ మొదలైన పలు అంశాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసిన‌ట్లు ఏపి డి‌జి‌పి గౌతం స‌వాంగ్ తెలిపారు. ముఖ్యంగా రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామ‌ని హెచ్చరించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోల్ మరియు మెడికల్ అండ్ హెల్త్ శాఖల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. 
 
రెమిడిసివేర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలెండర్లు బ్లాక్ మార్కెట్లలో అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100కు, 1902కు ఫోన్ చేయాల‌ని సూచించారు. కోవిడ్ రోగుల నుండి ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజు లపై ఆరా తీస్తున్నాం అన్నారు. పరిమితికి మించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అటువంటి సమాచారాన్ని డయల్ 100, 1902 ద్వారా చేరవేయాల‌న్నారు.
 
ఆక్సిజన్  వాహనాలకు రవాణా పరమైన ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు కోసం రాష్ట్ర స్థాయి మరియూ జిల్లా స్థాయి నోడల్ ఆఫీకారులు నియమించిన‌ట్లు డి‌జి‌పి పేర్కొన్నారు. ఇతర శాఖలతో సమన్వయం కోసం  కోవిడ్ కంట్రోల్ రూమ్‌లో ఇద్దరు ఐపీఎస్ అధికారుల నియామకం చేసిన‌ట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలను తూఛా తప్పకుండా పాటించాల‌ని డీజీపీ హితవు ప‌లికారు. 
 
అమ‌రావ‌తి క్రైం, సెల్ఐటి న్యూస్‌..  మాస్క్ ధరించకపోతే జరిమానాలు విధిస్తామ‌న్నారు. రాత్రి పూట కర్ఫ్యూ సమర్థవంతంగా అమలు చేస్తున్న‌ట్లు చెప్పారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో కరోనాపై అవాస్తవాలు, పుకార్లను ప్రచారం చేస్తే చట్టపర‌మైన చర్యలు తీసుకుంటామ‌ని డి‌జి‌పి గౌతం స‌వాంగ్ హెచ్చ‌రించారు. కోవిడ్ ఆసుప‌త్రుల‌పైన సోష‌ల్ మీడియాలో కొందరు అవాస్తవాలు వ్యాపింపచేస్తున్నార‌ని అటువంటి శక్తులపైనా నిఘా ఉంచామ‌న్నారు. ముఖ్యంగా ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాల‌ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments