Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో తుమ్మినా, కాలు జారిపడినా వార్తే.. తెలంగాణలో 1500 మంది చనిపోతే?: పవన్ కల్యాణ్

కేంద్రానికి, జాతీయ మీడియాకు దక్షిణాదిపై చిన్నచూపని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. జల్లికట్టు, ప్రత్యేక హోదా అంశాలతో కేంద్రంపై ప్రజలకు వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. తెలంగాణలో 1500మంది చన

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2017 (15:29 IST)
కేంద్రానికి, జాతీయ మీడియాకు దక్షిణాదిపై చిన్నచూపని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. జల్లికట్టు, ప్రత్యేక హోదా అంశాలతో కేంద్రంపై ప్రజలకు వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. తెలంగాణలో 1500మంది చనిపోతే గానీ, అటు కేంద్రం, ఇటు జాతీయ మీడియా పట్టించుకోలేదని పవన్ మండిపడ్డారు.

ఢిల్లీలో తుమ్మినా, కాలు జారిపడినా జాతీయ మీడియాకు వార్తేనని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. జాతీయ మీడియా దక్షిణాది కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. హిందీని తాము గౌరవిస్తామని.. దక్షిణాదిని కూడా గౌరవించాలని పవన్ మీడియాకు సూచించారు.  
 
దక్షిణాది కాబట్టే అర్థరాత్రి రాష్ట్రాన్ని విడగొట్టేశారని, అదే మహారాష్ట్ర నుంచి విదర్భను గానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని గానీ విడగొట్టలేకపోతున్నారని తెలిపారు. కేంద్రానికి మెజార్టీ.. అలాంటి  పరిస్థితుల్లో ఆ రాష్ట్రాలను ఎందుకు విడగొట్టట్లేదని పవన్ ప్రశ్నించారు. ఏపీకి హోదా ఇస్తామంటారు? అవసరమా అంటారు? గానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తనకు ఎవరూ భయపడటం లేదని, అలా అనుకోవడం అవివేకమవుతుందని.. తన డిమాండ్లపై చంద్రబాబు స్పందించడంపై పవన్ అన్నారు.
 
ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం వైఖరిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్‌ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఖండించారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రం ఎన్నో ప్రయోజనాలు కోల్పోతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్ర సాయం అవసరమని పేర్కొన్నారు. పవన్‌ ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments