Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్-19.. ఏపీలో రోజుకు 7వేల కేసులు.. డీఎడ్ పరీక్షలు వాయిదా..

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:59 IST)
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి జరగాల్సిన డిఎడ్ పరీక్షలను కోవిడ్-19 కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారమైతే... డి.ఈఐ.ఈడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ సెప్టెంబర్ 28న జరగాల్సి ఉంది. విద్యాశాఖ అధికారులు అందుకు ఏర్పాట్లు కూడా చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ విజృంభించడంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 
రోజూ 7వేల దాకా కొత్త కేసులు వస్తుండటంతో... ఈ పరిస్థితుల్లో ఈ పరీక్షలు జరపడం కష్టమేనని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. తాజా ఆదేశం ప్రకారం ఈ పరీక్షలు మళ్లీ ఎప్పుడు జరిపేదీ తెలపలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ పరీక్షలు జరగబోవని తెలిపింది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,073 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 661458కి పెరిగింది. కొత్తగా 48 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 5606కి చేరింది. కొత్తగా 8,695 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,88,169 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 67,683 యాక్టివ్ కేసులున్నాయి. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments