అమరావతిలో లీజుకు భవనాలు.. సీఎం జగన్ ఆమోదం

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (20:15 IST)
రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించిన భవనాలను లీజుకు ఇచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఈ మేరకు సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్యోగుల కోసం నిర్మించిన గ్రూప్ డి భవనాలను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా, విట్ యునివర్సిటీకి ఒక భవనాన్ని లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఏడాదికి 8 నుంచి 10 కోట్ల రూపాయల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది. ముందుగా ఒక యూనిట్ భవనాన్ని లీజు ప్రాతిపదికన విట్ యూనివర్సిటీకి ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ఈ మేరకు సంస్థతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
తొలుత ఒక టవర్‌ లీజుకు ఇవ్వాలని ఆ తదుపరి మిగిలిన 5 టవర్‌లు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఒక టవర్‌లోని 120 ఫ్లాట్‌లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భవనాల లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. 
 
గ్రూప్‌ డి కేటగిరీ కింద ఉద్యోగులకు 6 రెసిడెన్షియల్‌ టవర్‌లు నిర్మించారు. సీఆర్​డీఏ 2019 నాటికే 7.76 ఎకరాల విస్తర్ణంలో 720 ఫ్లాట్‌ల నిర్మాణాన్ని ప్రారంభించగా.. 65 శాతం మేర పనులు పూర్తయ్యాయి. అంతా పూర్తైతే మొత్తం 10 లక్షల 22 వేల 149 చదరపు అడుగుల సూపర్‌ బిల్టప్‌ ఏరియా అందుబాటులోకి రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments