Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారంచేడు వైద్యుడికి సీఎం జగన్ రూ.కోటి ఆర్థిక సాయం

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (16:12 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఓ వైద్యుడిపై కరుణ చూపారు. ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన ప్రభుత్వ డాక్టర్ భాస్కరరావు చికిత్స కోసం రూ.కోటి సాయం అందించారు. ఇందుకుగాను ఆయన కుటుంబసభ్యులు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
 
ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ఎన్‌.భాస్కరరావు చికిత్సకు రూ.కోటి నిధులు అందజేశారు. కరోనా రోగులకు వైద్యం అందజే అదే మహమ్మారికి చిక్కిన భాస్కరరావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
ఊపిరితిత్తులు పూర్తిగా పాడైనందున తక్షణం వాటిని మార్చాలని డాక్టర్లు సూచించారు. ఇందుకోసం ఏకంగా రూ.కోటిన్నర వరకు ఖర్చవుతుందని వైద్యులు వెల్లడించారు ఈ నేపథ్యంలో వైద్యుడి బంధువులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి పరిస్థితి వివరించారు. 
 
దీంతో ఆయన శుక్రవారం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన సీఎం... భాస్కరరావు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి రూ.కోటి విడుదల చేయించారు. అవసరమైతే మిగిలిన రూ.50 లక్షలు కూడా అందజేసేందుకు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రి బాలినేని వారికి తెలిపారు. దీంతో భాస్కరరావు కుటుంబసభ్యులు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments