Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ హీరోలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్... జస్ట్ షిఫ్ట్ అయితే చాలు..

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (18:51 IST)
తనను కలిసిన తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ హీరోలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోన్మోహన్ రెడ్డి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. విశాఖపట్టణంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఇందుకోసం ఎలాంటి సాయమైనా చేస్తానని హామీ ఇచ్చారు. పనిలోపనిగా ఇళ్ళ స్థలాలు, స్టూడియోల నిర్మాణాలకు స్థలాలు ఇస్తానని, అందువల్ల హైదరాబాద్ నుంచి విశాఖకు మకాం మార్చాలని ఆయన కోరారు. తద్వారా ఏపీని పెద్ద సినిమా హబ్‌గా మార్చుదామంటూ ఆయన పిలుపునిచ్చారు. 
 
చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం, టిక్కెట్ల ధరల తగ్గింపు తదితర సమస్యల పరిష్కారం కోసం తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అగ్రహీరోలు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ తదితరులు గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ వారితో మాట్లాడుతూ, సినీ పరిశ్రమను ఏపీకి తీసుకుని రావాలని కోరారు. విశాఖకు వస్తే బంపర్ ఆఫర్లను ఇస్తానని చెప్పారు. "ఏపీకి షిఫ్ట్ అవ్వండి. వైజాగ్‌కు వచ్చేయండి. అందరికీ స్థలాలిస్తా. ఏపీని పెద్ద సినిమా హబ్‌గా మార్చుదాం. టాలీవుడ్‌కి తెలంగాణ కంటే ఏపీ నుంచే ఎక్కువగా ఆదాయం వస్తోంది. జనాభా పరంగా కూడా ఏపీ జనాభానే ఎక్కువ. థియేటర్లు కూడా ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయి" అని వివరిచారు. 
 
పైగా, విశాఖలో వాతావరణం కూడా బాగుంటుంది. విశాఖలో అందరికీ స్థలానిస్తా. జూబ్లీహిల్స్ లాంటి ఒక ఏరియాను క్రియేట్ చేద్దాం. స్టూడియోలు పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉన్నవారు ముందుకొస్తే వారికి కూడా స్థలానిస్తాను. మన రాష్ట్రంలోనే పెద్ద సిటీ విశాఖ. చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌లతో కొంతమేర పోటీపడగలిగిన స్థాయి ఒక్క విశాఖకే ఉందని చెప్పారు. అందువల్ల తెలుగు చిత్రపరిశ్రమ విశాఖకు తరలిరావాలని సీఎం జగన్ వారిని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments