Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ బెయిల్‌ రద్దుపై తెలంగాణా హైకోర్టు తీర్పు రిజర్వు

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (17:42 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అక్రమాస్తుల కేసులో జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన సోమవారం మరోసారి వాదనలు విన్న తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. 
 
 
గతంలో ఇదే అంశంపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించడంతో ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్రుడిలా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రఘురామ తరఫున న్యాయవాది వెంకటేశ్‌ వాదనలు వినిపించారు. సీఎం హోదాలో జగన్‌ సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారంటూ వాదించారు. జగన్‌కు నోటీసులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై వైఖరి ఏమిటని సీబీఐని హైకోర్టు ప్రశ్నించగా.. సీబీఐ కోర్టు తీర్పు తర్వాత పరిస్థితిలో ఏమీ మార్పులేదని స్పష్టంచేసింది. దీంతో రఘురామ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments