Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ జాతకాలన్నీ నా దగ్గరున్నాయి... తోకలు కత్తిరిస్తా!: నేతలకు చంద్రబాబు వార్నింగ్

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహోద్రుక్తులయ్యారు. తన మాట వినని నేతలకు తీవ్ర హెచ్చరిక చేశారు. మీ జాతకాలన్నీ నా దగ్గరున్నాయి.. తోకలు కత్తిరిస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా వెల

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (20:30 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహోద్రుక్తులయ్యారు. తన మాట వినని నేతలకు తీవ్ర హెచ్చరిక చేశారు. మీ జాతకాలన్నీ నా దగ్గరున్నాయి.. తోకలు కత్తిరిస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో విజయనగరం జిల్లా నేతల సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా ఇన్‌‌ఛార్జ్‌ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, నారాయణస్వామి నాయుడు, మీసాల గీత, చిరంజీవులు తదితర నేలంతా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా జిల్లా నేతల మధ్య పొడచూపిన విభేదాలను చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. 'జిల్లాలోని లుకలుకలు నాకు తెలియవనుకుంటున్నారా?' అని బాబు ప్రశ్నించారు. తప్పులు సరిదిద్దుకుంటారని ఓపికగా చూస్తున్నానని, విభేదాలు మరచి పని చేయాలని ఆయన సూచించారు. 
 
'సాలూరు ఎమ్మెల్యే ఉండగా, అక్కడ మీకేం పని?' అంటూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను ప్రశ్నించారు. తనకేమీ తెలియదనుకుంటే తోకలు కత్తిరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విభేదాలు మరచి సమన్వయంతో పని చేయాలని, పార్టీని నాశనం చేయాలని చూస్తే మాత్రం తాను చూస్తూ ఊరుకోనని బాబు తెలిపారు. అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దని చంద్రబాబు జిల్లా నేతలకు గద్గదస్వరంతో హెచ్చరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments