Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెసి సహనం కోల్పోవద్దు - జాగ్రత్త.. బాబు క్లాస్

దేనికైనా ఒక సందర్భం ఉంటుంది. అన్నిటికీ కోప్పడితే ఎలా... మనం అలా ప్రవర్తించకూడదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం. సహనం అస్సలు కోల్పోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎవరో చెప్పింది కాదు. స్వయంగా ఏపీ సీఎం చ

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (16:00 IST)
దేనికైనా ఒక సందర్భం ఉంటుంది. అన్నిటికీ కోప్పడితే ఎలా... మనం అలా ప్రవర్తించకూడదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం. సహనం అస్సలు కోల్పోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎవరో చెప్పింది కాదు. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జెసి.దివాకర్ రెడ్డికి ఇచ్చిన ప్రత్యేక క్లాస్. అమరావతిలో ప్రత్యేకంగా జెసితో మాట్లాడిన బాబు 15 నిమిషాల పాటు క్లాస్ పీకారట. బాబు అలా మాట్లాడతారని జెసి అస్సలు ఊహించలేదట. 
 
ట్రావెల్ బ్యాన్ వివాదాన్ని పరిష్కరించుకోవాలని జెసికి బాబుకు సూచించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో బోర్డింగ్ పాస్ విషయంలో ఎయిర్‌పోర్టు సిబ్బందిపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి ప్రింటర్‌ను లాగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ప్రస్తుతం ట్రావెల్ బ్యాన్ ఉంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లగా ఎయిర్‌పోర్టు సిబ్బంది అడ్డుకోవడంతో ఆయన వెనుదిరిగారు.
 
ఆ తరువాత మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. దీనిపై పార్టీ పరువు కూడా పోతోందని భావించిన ముఖ్యమంత్రి జెసికి క్లాస్ పీకారట. ఇప్పటికైనా కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతిరాజుతో కలిసి కూర్చుని మాట్లాడుకోమని, ఇలాంటిది మరోసారి జరక్కూడదని చెప్పారట బాబు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments