Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకా... భ‌య‌మా... పవన్ అలా మాట్లాడ‌టం స‌రికాదు... సీఎం చంద్రబాబు

అనంత‌పురం: 'ఏ లొసుగులూ లేకపోతే సీఎం ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయట్లేదు? సీబీఐ కేసులంటూ భయపడతారు.. దాచుకోడానికేమైనా ఉన్నాయా? ఏమీ లేనప్పుడు కేంద్రమంటే ఎందుకంత భయం?' అని పరోక్షంగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2016 (19:30 IST)
అనంత‌పురం: 'ఏ లొసుగులూ లేకపోతే సీఎం ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయట్లేదు? సీబీఐ కేసులంటూ భయపడతారు.. దాచుకోడానికేమైనా ఉన్నాయా? ఏమీ లేనప్పుడు కేంద్రమంటే ఎందుకంత భయం?' అని పరోక్షంగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో దుమారం చెలరేగుతోంది. 
 
తెలుగుదేశం ఎంపీలు ఒక్కొక్కరిగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ పైన నిప్పులు చెరుగుతున్నారు. చివరికి ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు సైతం పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆదివారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం విలేకరులతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అంశంపై తాను ఎవరికీ భయపడటం లేదని, తిరుపతి సభలో పవన్ కల్యాణ్ అలా మాట్లాడటం సరికాదని అన్నారు. 
 
హోదాతోపాటు విభజన చట్టంలోని హామీలపై తాము రాజీలేని పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నదని చంద్రబాబు చెప్పారు. అనంతలో ఎండిపోతున్న వేరుశనగ పంటలను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments