జగన్ ఫోటో ఉన్నా సరే విద్యా కిట్లు పంపిణీ చేయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

వరుణ్
గురువారం, 13 జూన్ 2024 (14:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లి తన ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అక్కడ నుంచి రాష్ట్ర ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. తిరుమల పవిత్రను, పరిశుభ్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రజాధనం వృధా చేయరాదన్ని సంకల్పంతో కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పంపిణీ చేసే విద్యా కిట్లపై మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నప్పటికీ పంపిణీ చేయాలని ఆదేశించారు.
 
కాగా, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తమ ప్రభుత్వ పాలనలో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు, పగ ఉండవని ప్రకటించి, ఆ మాటలను చేతల్లో నిరూపించారు. రాష్ట్రంలో స్కూల్స్ పునఃప్రారంభమైన నేపథ్యంలో జగన్ ఫోటో ఉన్నప్పటికీ విద్యార్థులకు ఆ కిట్‌లను పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేయద్దంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం హోదాలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ స్వాగతిస్తూ, ఆసక్తికర ట్వీట్ చేసింది. 
 
"బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృధా కాకూడదు. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదంటూ... జగన్ బొమ్మ ఉన్న స్కూల్  పిల్లల కిట్స్‌ను అలాగే పంపిణీ చేయమని ఆదేశించిన సీఎం చంద్రబాబు గారు" అంటూ టీడీపీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ పోస్టరుతో ట్వీట్ చేసింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments