Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే కిడారి హత్యపై చంద్రబాబు కామెంట్స్...

అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావును మావోయిస్టులు కాల్చివేసిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎంకు అధికారుల

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (15:09 IST)
అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావును మావోయిస్టులు కాల్చివేసిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎంకు అధికారులు ఈ విషయాన్ని చేరవేశారు. అరకు ఏజెన్సీలో మావోయిస్టులు జరిపిన కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులు, హత్యలు మానవత్వానికే మాయనిమచ్చని, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ దాడిని ఖండించాలని కోరారు.
 
వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యున్నతికి కిడారి చేసిన సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. డుంబ్రీగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద బసులో వెళుతున్న కిడారిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
 
దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి కొన్ని నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్‌గా కూడా ఉన్నారు. నిజానికి మావోయిస్టులు హిట్‌ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. తన క్వారీ మైనింగ్‌ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారి, ఆయన అనుచరులపై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments