Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపిలో కొత్త మంత్రులు వీరే... ఇది ఫైనలట...? ప్రత్తిపాటి పుల్లారావుకు ఊడుతుందా?

తెలుగుదేశంపార్టీలోకి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో మంత్రులను తీసుకోలేదన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వం ఏర్పాటై మూడు సంవత్సరాలవుతున్నా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలామంది రెండు, మూడు శాఖలను చూసుకుంటున్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (13:49 IST)
తెలుగుదేశంపార్టీలోకి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో మంత్రులను తీసుకోలేదన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వం ఏర్పాటై మూడు సంవత్సరాలవుతున్నా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలామంది రెండు, మూడు శాఖలను చూసుకుంటున్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్న విమర్శలు లేకపోలేదు. ఎలాగైనా మంత్రివర్గాన్ని విస్తరించాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారట. అది కూడా ఉన్న వారిలో కొంతమందిని తీసేసి కొత్తవారిని చేర్చుకోవడం. ఇది ఎప్పటి నుంచో తెలిసిందే.
 
అయితే ఉన్న మంత్రుల్లో నలుగురిని తీసేసి కొత్తగా 10 మందిని తీసుకోనున్నారని తెలుస్తోంది. అది కూడా ఏప్రిల్ 2వ తేదీనే ముహూర్తం ఖరారు చేసేశారట బాబు. ఈ విషయాన్ని ఇప్పటికే గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్ళారట. ఫైనల్‌గా మంత్రులు కానున్న వారు నారా లోకేష్‌, అఖిలప్రియ, యరపతనేని శ్రీనివాసరావు, చాంద్ బాషా, సుజయ క్రిష్ణరంగారావు, శ్రీరామ్ రాజగోపాల్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనంద్, డాక్కా మాణిక్యవరప్రసాద్, మాగుంట శ్రీనివాసులరెడ్డి. వీరందరూ కొత్తగా మంత్రివర్గంలోని వెళ్ళేవారట. 
 
ఇక మంత్రివర్గం నుంచి పదవులు పోయే వారిలో మొదటగా రావెళ్ళ కిషోర్ బాబు, సిద్ధా రాఘవరావు, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, మృణాళిని, పత్తిపాటి పుల్లరావులు ఉన్నారని సమాచారం. ఉన్న మంత్రుల్లో సీనియర్లు కూడా ఉన్నారు. వారిలో కొంతమంది మంత్రుల శాఖలు కూడా మారుస్తున్నారట. వారిలో మొదటగా కె.ఈ.క్రిష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావులు ఉన్నారట. మరి ఇదే మార్పు జరిగితే వీరందరూ బాబు చేసింది ఒప్పుకుంటారా.. లేక తిరగబడతారా అన్నది ఆసక్తిగా మారింది. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments