Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్నాయుడికి హోం... లోకేష్ బాబుకు బెర్త్...?

విజ‌య‌వాడ‌ : మరికొద్ది రోజుల్లో ఏపీ కేబినెట్ విస్తరణ జరుగనుంది. ఇందులో రాష్ట్ర హోంమంత్రిగా కింజరపు అచ్చెన్నాయుడికి అవకాశం కలిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ యువనేత లోకేష్ బాబుని మంత్రివర్గంలోకి తీసుకొనున్నట్లు సమాచారం. ముస్లింలకి మంత్ర

Webdunia
మంగళవారం, 19 జులై 2016 (13:42 IST)
విజ‌య‌వాడ‌ : మరికొద్ది రోజుల్లో ఏపీ కేబినెట్ విస్తరణ జరుగనుంది. ఇందులో రాష్ట్ర హోంమంత్రిగా కింజరపు అచ్చెన్నాయుడికి అవకాశం కలిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ యువనేత లోకేష్ బాబుని మంత్రివర్గంలోకి తీసుకొనున్నట్లు సమాచారం. ముస్లింలకి మంత్రి ప‌దవి ఇస్తానని సీఎం హామీ నేపథ్యoలో వైసీపీ నుంచి వచ్చిన కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషాకి మంత్రివర్గంలో అవకాశం ఉన్నట్లు సమాచారం. వైసీపీ నుంచి వ‌చ్చిన కాపు నేత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
 
గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేలు మోదగుల వేణుగోపాల్ రెడ్డి, ధూళిపాల నరేంద్రకు అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీలు గాలి ముద్దుక్రిష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్‌ల‌కు అవకాశం క‌ల్పించేందుకు చంద్రబాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్ మోహన్‌కి ఈసారి మంత్రి పదవి ఖాయం అంటున్నారు. ఇక వైసీపీ నుంచి తేదెపాలో చేరిన కర్నూలు జిల్లా భూమా కుటుంబం నుంచి ఎమ్మెల్యే అఖిలకు ఛాన్స్ ఉంద‌ని చెపుతున్నారు.
 
భూమా నాగిరెడ్డి గత కొద్ది రోజూలుగా తెదెపా మీద అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యoలో మంత్రి పదవి వస్తుందా అనే సందేహo నెల‌కొంది. కానీ, భూమా కుటుంబంలో ఒక్కరికి మంత్రి పదవి కన్ఫర్మ్ అంటున్నారు రాయలసీమ తెదెపా నేతలు. ఇప్పటికే మంత్రి పదవి రేసులో ఉన్న మరికొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత వద్ద తమ ప్రొఫైల్‌లు ఇచ్చినట్లు సమాచారం. మ‌రోప‌క్క ఎమ్మెల్యే బాలకృష్ణ,  లోకేష్ బాబుని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కాకా ప‌డుతున్నారు. అయితే, తమ అధినేత చంద్ర‌బాబు మనస్సులో ఏమున్న‌దో చివరిదాకా తెలుసుకోలేమ‌ని పార్టీ పెద్ద‌లే చెపుతున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments