Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి... కేబినెట్ నిర్ణయం

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (16:50 IST)
అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని పేరు అమరావతిగా ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ప్రకటించనున్నారు. బుధవారం ఉదయం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో, కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన పారిశ్రామిక విధానం, మిగతా రాష్ట్రాలతో సమాన హోదా వచ్చే వరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

 
రాష్ట్రానికి నిధులు విడుదల చేసినందుకు కేబినెట్ కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేసింది. ఇకపోతే పది లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేబినెట్ వ్యవసాయం, బయోటెక్ రంగాలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే భూములను 99 ఏళ్లు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. మరిన్ని వివరాలను సీఎం ఈ రోజు సాయంత్రం తెలుపుతారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments