Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం కూడా ప్రత్యేక హోదానే డిమాండ్ చేస్తున్నాం : బీజేపీ ఎంపీ హరిబాబు

తాము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే, ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో దానికి సమానమైన నిధులను ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిప

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (09:17 IST)
తాము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే, ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో దానికి సమానమైన నిధులను ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారని ఆయన వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు, ప్రధానమంత్రి పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ద్వారా ఏపీకి లభించాల్సిన ప్రతిఫలం విషయాల గురించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో.. ఏపీ ఆర్థికమంత్రి యనమల, కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు ఎంపీలు, అధికారులు మాట్లాడటం జరిగింది. 
 
ప్రధానంగా ఆర్థిక లోటు భర్తీ, ఇప్పటివరకూ ఇచ్చిన నాలుగువేల కోట్లకు అదనంగా ఎంత రాష్ట్రానికి రావాలి. అలాగే ప్రత్యేక హోదా ఇస్తే ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో ఆ ప్రయోజనాన్ని పూర్తిగా కేంద్రం అందించే విషయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలల్లో.. ప్రత్యేక హోదా ఇస్తే 90 శాతం నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. 10 శాతం నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలి. హోదా లేకపోతే 60 శాతం కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలన్నారు. 
 
ప్రత్యేక ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఈ నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చే విధంగా నిర్ణయిస్తామని జైట్లీ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ 60, 90 శాతానికి మధ్య ఉన్న నిధులు ఏ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు వస్తాయి, ఈ నిధులన్నింటీని ఏపీకి ఎలా ఇవ్వాలనే దానిపై కూడా చర్చ జరిగిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments