Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు రిపేర్ చేస్తుండగా ప్రమాదం.. అమెరికాలో ముదినేపల్లి టెక్కీ దుర్మరణం

అమెరికాలో కృష్ణా జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యాడు. కారు రిపేర్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఈ టెక్కీ మృత్యువాతపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (13:19 IST)
అమెరికాలో కృష్ణా జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యాడు. కారు రిపేర్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఈ టెక్కీ మృత్యువాతపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అమెరికాలోని పిట్స్ బర్గ్ ప్రాంతంలో కృష్ణా జిల్లా ముదినేపల్లికి వల్లభనేని హరీష్ (42) అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈయన... బయటకు వెళ్లేందుకు కారు స్టార్ట్ చేయగా అది స్టార్ట్ కాలేదు. దీంతో బోనెట్ పైకెత్తి పరీక్షిస్తుండగా కారు ఒక్కసారిగా ముందుకు దూకింది. దీంతో ఆయన కిందపడి పోవడంతో కారు అతని ఛాతీ మీదుగా దూసుకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. 
 
కారు పార్కింగ్ చేసివున్న ప్రాంతంలో ముందుభాగం బాగా డౌన్ ఉండటంతోనే కారు ఒక్కసారి ముందుకు దూసుకొచ్చి ఈ ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటన జరగడానికి గంట ముందే అతను భారత్‌లోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడారని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments