Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో జర్నీ కాదు.. మృత్యు ప్రయాణం ... పట్టుకుంటే ఊడివచ్చిన రోప్ క్యాబిన్

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (12:48 IST)
హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. నిత్యం ఏదో ఒక అపశృతి చోటుచేసుకుంటుంది. దీంతో ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణం చేయాలంటేనే హడలిపోతున్నారు. తాజాగా రైలులో నిలబడి ప్రయాణించే ప్రయాణికులకు ఆధారంగా ఉండే రోప్‌లు వేలాడే క్యాబిన్‌ పట్టుకుంటే ఊడివచ్చింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లోని మెట్రోలైన్‌ కారిడార్‌-1 ఎల్‌బీనగర్‌-మియాపూర్‌ మార్గంలో శనివారం ఉదయం ఊహించని ఘటన ఒకటి జరిగింది. రైలులో నిలబడి ప్రయాణించే ప్రయాణికులకు ఆధారంగా ఉండే రోప్‌లు వేలాడే క్యాబిన్‌ పట్టుకుంటే ఊడివచ్చింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 
 
మెట్రో రైలు ఎంతో సురక్షితమని ఓవైపు ప్రభుత్వంతో పాటు మెట్రో రైల్ యాజమాన్యం పదేపదే చెబుతున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉండటం ప్రయాణికులను ఆశ్యర్యానికి లోనుచేస్తోంది. ఇటీవల అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో శ్లాబ్‌ పెచ్చులూడి మీద పడడంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments