Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో మరో 98 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 31 మే 2020 (14:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 98 మందికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 9370 శాంపిళ్లను పరిశీలించగా, ఇందులో 98 మందికి కరనా వైరస్ సోకినట్టు తేలింది. అలాగే, 24 గంటల్లో 43 మంది చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 
 
కాగా, ఈ కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,042  అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 845 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,135 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 62కి చేరింది.
 
దేశంలో 24 గంటల్లో 8380 కేసులు 
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో మరో 8380 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో 193 మంది ప్రాణాలు కోల్పోయారు. 
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,82,143కి చేరగా, మృతుల సంఖ్య 5,164కి చేరుకుంది. 89,995 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,984 మంది కోలుకున్నారు.
 
21 మంది కోలుకుంటున్నారు : లారెన్స్ 
అనాథ చిన్నారుల కోసం తాను నిర్వహిస్తున్న ట్రస్టులోని 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బంది కరోనా బారినపడిన మాట వాస్తవమేనని ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తెలిపారు. అయితే, ప్రస్తుతం వాళ్లంతా కోలుకుంటున్నారని చెప్పారు. 
 
చెన్నై అశోక్ నగరంలోని లారెన్స్ ట్రస్టులో వారం రోజుల క్రితం ట్రస్టులోని కొందరు చిన్నారుల్లో జ్వరంతోపాటు కోవిడ్-19 లక్షణాలు కనిపించడంతో వారికి వెంటనే పరీక్షలు చేయించినట్టు తెలిపారు. ఈ పరీక్షల్లో 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు.
 
కరోనా బారినపడిన ముగ్గురు సిబ్బందిలో ఇద్దరు దివ్యాంగులు ఉన్నారని వివరించారు. వైరస్ బారినుంచి వారు త్వరగానే కోలుకుంటున్నారని, సమాచారం అందుకున్న వెంటనే చర్యలు తీసుకున్న ఎస్పీ వేలుమణికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు రాఘవ లారెన్స్ తెలిపారు. చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు దేవుడ్ని ప్రార్థించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments