Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో మరో 45 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 21 మే 2020 (14:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 45 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజానికి రెండు మూడు రోజులుగా ఈ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కానీ, గురువారం ఒక్కసారిగా ఈ కేసులు పెరిగాయి. బుధవారం 9 గంటల నుంచి గురువారం 9 గంటల వరకు 24 గంటల వ్యవధిలో మరో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 
 
కొత్తగా నమోదైన కేసులతో కలిపితే ఏపీలో మొత్తం 2,452కి చేరుకుంది. గురువారంఒకరు మృతి చెందగా.. కరోనాతో ఇప్పటివరకు 54మంది మృతి చెందారు. కరోనాతో మరణించిన వ్యక్తిని నెల్లూరు వాసిగా గుర్తించారు. కాగా, ప్రస్తుతం ఏపీలో మొత్తం 1,680మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 718. గత 24 గంటలుగా 8,092 శాంపిల్స్‌ను పరీక్షించగా 45 మంది కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా 41 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. 
 
ఇదిలావుంటే, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల్లో 153 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో మహారాష్ట్రకు చెందిన వారు 101 మంది ఉండగా, గుజరాత్ నుంచి 26, కర్నాటక్ 1, వెస్ట్ బెంగాల్ 1, రాజస్థాన్ 11, తమిళనాడు 3 చొప్పున ఉన్నాయి. ఇందులో 128 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments