Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో 3 ఎన్.సి.సి అకాడమీలు... సి సర్టిఫికెట్ క్యాడెట్లకు పోలీసు ఉద్యోగాల్లో ప్రాధాన్యం

అమరావతి : రాష్ట్రంలో మూడు ఎన్‌సిసి అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సర్వీసులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్సీసి కార్యకలాపాలపై గురువారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (16:27 IST)
అమరావతి : రాష్ట్రంలో మూడు ఎన్‌సిసి అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సర్వీసులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్సీసి కార్యకలాపాలపై గురువారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్‌సిసిని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పారు. 
 
సీఎం ఆశయాలకు అనుగుణంగా ఎన్‌సిసిని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నం, కర్నూలులో ఎన్‌సిసి అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వీటికి కావాల్సిన స్థలం కూడా ఇప్పటికే గుర్తించామన్నారు. అకాడమీల ఏర్పాటుకు అవసరమైన నిధుల కోసం వచ్చే రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 67,680 మంది విద్యార్థులు ఎన్‌సిసిలో ఉన్నారని, మరిన్ని కాలేజీలు.. ఎన్‌సిసి ప్రారంభించాలని కోరుతున్నాయని వివరించారు. మహిళలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందని.. వారికి ఎన్‌సిసిలోనే కాకుండా ఇతరత్రా నైపుణ్యాల శిక్షణ ఎలా ఇవ్వాలనేది కూడా ఆలోచిస్తున్నామన్నారు. బడ్జెట్ కేటాయింపులు, ఇతరత్రా సమస్యలను కూడా సత్వరం పరిష్కరిస్తామన్నారు. తరచూ ఇలాంటి సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించుకొంటామన్నారు. 
 
మరో సమావేశం జనవరిలో ఏర్పాటు చేయనున్నట్లు  మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్.వీ.సుబ్రహ్మణ్యం, ఎన్‌సిసి ఎయిర్ వింగ్ కమాండర్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంలకు ఎన్‌సిసి తరపున మెమెంటోలు అందజేశారు. 
 
‘సి’ సర్టిఫికెట్ క్యాడెట్లకు ఉపశమనం కల్పించండి
పోలీసు ఉద్యోగాల నియామకాల్లో ‘సి’ సర్టిఫికెట్ కలిగిన ఎన్.సి.సి క్యాడెట్ అభ్యర్థులకు రాత పరీక్ష రాసే అవసరం లేకుండా మినహాయింపు ఇవ్వాలని ఈ సమావేశంలో ఎన్.సి.సి అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఆర్మీ నియామకాల్లో ఈ మినహాయింపు ఇస్తున్న విషయాన్ని అధికారులు మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments