Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుగుబంటి ఎన్‌క్లోజర్ తెరిచేవుంది.. క్లీన్ చేస్తుంటే దాడి.. ఆపై?

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (14:35 IST)
విశాఖలోని ఇందిరా గాంధీ జూలోని ఎలుగుబంటి దాడి ఘటనలో ఓ సంరక్షకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని జూలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న బానాపురపు నగేష్‌(23) గా గుర్తించారు.
 
నగేష్ యధావిధిగా సోమవారం ఉదయం జూ పార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తున్నాడు. ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌‌లో ఉందని భావించి ఆ ఉద్యోగి క్లీనింగ్‌లో మునిగిపోయాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది.
 
వాస్తవానికి ఎలుగుబంటి బోను తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించకపోవటంతో నగేష్ దాడికి గురయ్యాడు. తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. ఆ ఎలుగుబంటి అతడిపై తీవ్రంగా దాడి చేసి చివరికి ప్రాణాలు తీసింది. జూలో సందర్శకులు చూస్తుండగానే ఈ ఆకస్మాత్తుగా దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ దారుణాన్ని చూసిన సందర్శకులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
నగేష్‌ స్వస్థలం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని టి.బూర్జవలస. గత రెండేళ్లుగా నగేష్‌ జూలో విధులు నిర్వహిస్తున్నాడని, మృతుని కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించినట్లు క్యూరేటర్‌ సలారియా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments