Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ స్పెషల్ స్టేటస్ కోసం ఆమరణ దీక్ష చేపట్టనున్నాడా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. గురువారం సాయింత్రం కాకినాడలో ఏర్పాటవుతున్న సభ పూర్తి కాగానే ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (12:09 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. గురువారం సాయింత్రం కాకినాడలో ఏర్పాటవుతున్న సభ పూర్తి కాగానే ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్ ఆమరణ దీక్ష చేపట్టాల్సిందేనని నిర్ణయించినట్లు సమాచారం. 
 
తద్వారా పవన్ జనసేన పార్టీని ప్రజలోకి తీసుకెళ్లడానికి ఇదే సరైన ఆప్షన్‌గా పవన్ భావిస్తున్నాడు. పవన్ నిజంగానే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడా లేదా అనేది గురువారం కాకినాడలో ఏర్పాటు చేసిన సభకు అనంతరం తేలనుంది. ఒకవేళ పవన్ ఆమరణ నిరాహార దీక్ష చేపడితే మాత్రం కేంద్రం దిగిరావడం ఖాయమంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు.
 
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంపై గురువారం కాకినాడలో సభ నిర్వహిస్తున్న జనసేన పార్టీకి మాల మహానాడు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా మాల మహానాడు కన్వీనర్‌ చీకురుమెల్లి కిరణ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం మాల మహానాడు, జనసేన కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఇస్తానని హామిఇచ్చి ఇప్పుడు 14వ ఆర్ధిక సంఘం నెపం చూపిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కిరణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments