Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (22:41 IST)
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోయినా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట మేరకు.. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్‌లో భాగంగా మరో పథంక అమలుకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగినట్టుగా బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. ఇందుకు కొత్త బస్సులు కొనడం లేదా అవసమైతే అద్దెకు తీసుకోవడం వంటివి చేయాలని సూచించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్న విద్యుత్ ఆధారిత ఏసీ బస్సులో ఉండాలని, ఇపుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. అలాగే ప్రతి బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ఆయన అధికారులను నిర్ధేశించారు. 
 
రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రతి హామీని అమలు చేసి మాట నిలబెట్టుకోవాల్సి ఉందన్నారు. అదేసమయంలో ప్రజాధనం సద్వినియోగం కావాలని, ప్రతి రూపాయి విలువైనదేనని ఆయన అధికారులతో అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments