Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారుకు శుభవార్త : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (08:18 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి బదిలీ అయ్యారు. అలాగే, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టీస్‌ను కూడా బదిలీ వేశారు. ప్రస్తుత న్యాయమూర్తులను ఏకకాలంలో బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జీకే మహేశ్వరిని సిక్కింకు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్ చౌహాన్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు పంపుతున్నట్టు సమాచారం.
 
ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీని తెలంగాణకు, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా రానున్నట్టు తెలుస్తోంది. 
 
తెలంగాణ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ 23 జూన్ 2019 నుంచి సేవలు అందిస్తుండగా, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి 7 అక్టోబరు 2019 నుంచి సేవలు అందిస్తున్నారు.
 
జస్టిస్ చౌహాన్ తెలంగాణకు రెండో ప్రధాన న్యాయమూర్తి కాగా, జస్టిస్ మహేశ్వరి నవ్యాంధ్రకు తొలి ప్రధాన న్యాయమూర్తి. కాగా, కోల్‌కత్తా హైకోర్టులో 27 జూన్ 2011 నుంచి శాశ్వత న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చిని కూడా ఏపీ హైకోర్టుకు బదిలీ చేసే యోచన ఉన్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరిపై ఏపీ సర్కారు అనేక రకాలైన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అంతేకాకుండా, ఆయన్ను బదిలీ చేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేశారు. ఏపీ సర్కారు తీసుకున్న అనేక రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలను హైకోర్టు చీఫ్ జస్టీస్ తప్పుబడుతూ తీర్పులిచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments