Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా టీకాల పంపిణీకి సర్వం సిద్ధం .. జిల్లాలకు చేరిన వ్యాక్సిన్ డోస్‌లు

Webdunia
గురువారం, 14 జనవరి 2021 (07:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కరోనా టీకాలు వేయడానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో వ్యాక్సిన్‌ పంపిణీకి ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 
 
భారీ బందోబస్తు మధ్య కృష్ణాజిల్లా గన్నవరం వ్యాధినిరోధక టీకాల కేంద్రం నుంచి అన్ని జిల్లాలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తరలించారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలకు చేరుకున్నాయి. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్‌లో పనిచేస్తున్న 3.70 లక్షల మంది వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. కేసుల తీవ్రత, ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగుల సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాకు వేల సంఖ్యలో డోసులు పంపారు. 
 
ఆ ప్రకారంగా, కృష్ణా జిల్లాకు 42,500 డోసులు, గుంటూరు జిల్లాకు 43,500 డోసులు తరలించారు. దాంతోపాటు ప్రకాశం జిల్లా 31 వేలు, నెల్లూరుకు 38,500 డోసులు, వెస్ట్‌గోదావరి 33,500, ఈస్ట్‌గోదావరి జిల్లాకు 47 వేలు డోసులు పంపించారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు 26,500, విశాఖకు 46,500, విజయనగరం 21,500, అనంతపురం జిల్లాకు 35,500, కడప జిల్లాకు 28,500, కర్నూలుకు 40,500 వ్యాక్సిన్‌ డోసులు తరలించారు.

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments