Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలవారీ పింఛన్ల పెంపుపై కసరత్తు.. జూన్ నెలలో రూ.7 వేలు!!

ఠాగూర్
మంగళవారం, 11 జూన్ 2024 (15:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి ఇచ్చే వివిధ రకాల పింఛన్ల మొత్తాన్ని పెంచేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పింఛన్ల సొమ్మును పెంచి అందిజేయనున్నారు. 
 
రూ.4 వేల పింఛను పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించాయి. దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతామని హామీనిచ్చాయి. 
 
పింఛను జులై 1వ తేదీన అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులున్నారు. 
 
వీరికి పింఛను నగదు చెల్లింపులకుగాను నెలకు రూ.1.939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.7 వేలు (జులై 1న ఇచ్చే పింఛను రూ.4 వేలు+ ఏప్రిల్ నుంచి రూ.వెయ్యి చొప్పున రూ.3 వేలు) చొప్పున, దివ్యాంగులకు రూ.6 వేల పింఛనుకు జులై 1వ తేదీన పంపిణీ చేయడానికి రూ.4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 
 
ఆగస్టు నుంచి అయితే నెలకు రూ.2,800 కోట్లు వ్యయం అవుతుందని లెక్కగట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించనున్నారు. దివ్యాంగ పింఛనుదారులు రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం రూ.3 వేలు పింఛను తీసుకుంటున్నారు. 
 
వీరి పింఛనును రూ.6 వేలకు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవికాకుండా పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేల పింఛను, కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛను అందించేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాల్ని వైద్యశాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు సేకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments