Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని?

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (08:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులు కానున్నారు. ఆమె వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. 
 
ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎవరన్న అంశంపై చర్చ జరిగింది. దీనికి ఇపుడు సమాధానం కూడా దొరికింది. ఏపీ క్యాడర్‌కు చెందిన నీలం సాహ్ని కొత్త సీఎస్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఇందుకుసంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. సాహ్ని ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర సాంఘిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా ఉన్నారు. 
 
ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి సోమవారం మధ్యాహ్నం అమరావతి వచ్చిన సాహ్ని.. ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అనంతరం ఆయనతో కలిసి భోజనం చేసినట్టు తెలుస్తోంది.
 
నిజానికి సీనియారిటీ ప్రకారం చూస్తే 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూదన్ ముందున్నారు. ప్రీతి సూదన్ ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. 
 
ప్రీతి సహా మరికొందరి పేర్లు సీఎస్ రేసులో వినిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం రెండో స్థానంలో ఉన్న నీలం సాహ్ని వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments