Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్..థూ.. ఇవేం బ్రాండ్లు.. కిక్కే ఎక్కడం లేదు : మందుబాబుల వీరంగం

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (18:21 IST)
కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాలు మద్యం విక్రయాలకు శ్రీకారం చుట్టాయి. దీంతో నెలన్నర రోజుల డ్రై డే తర్వాత మద్యం కోసం తాగుబోతులు ఎగబడుతున్నారు. అయితే, ప్రస్తుతం విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లు ఏమాత్రం కిక్ ఇవ్వడం లేదని మద్యం బాబులు వాపోతున్నారు. 
 
కొత్తగా వచ్చిన బ్రాండ్లు బాగోలేవని, టేస్ట్ లేదని చెబుతున్నారు. పాత బ్రాండ్లే బాగుండేవని అంటున్నారు. అలవాటు పడ్డం కాబట్టి డబ్బులు ఎక్కువైనా చీప్ లిక్కర్ తాగుతున్నామని, కావాలిసిన బ్రాండ్ దొరకడంలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చీప్ లిక్కర్ తాగుతుంటే తలపట్టేస్తుందని, కడుపులో మంటగా ఉంటుందని మరికొందరు అంటున్నారు. మరి ఎందుకు తాగుతున్నారంటే అలవాటయిపోయిందని, మానలేకపోతున్నామని అంటున్నారు.
 
ఇకపోతే, మద్యం దుకాణాల ఎదుట తాగుబోతుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అయితే వైన్ షాపుల్లో తమకు నచ్చిన బ్రాండ్‌లు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ బ్రాండ్లు అమ్ముతున్నారో కనీసం మద్యం విక్రయిస్తున్న వారికి కూడా తెలియడం లేదని మండిపడుతున్నారు. 
 
ఎప్పుడూ వినని, చూడని, కొత్త కొత్త బ్రాండ్‌ల పేర్లతో మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైన్‌షాపుల వద్ద బ్రాండ్‌ల వివరాలు గానీ, ధరల పట్టిక గానీ పెట్టకుండా ఎలా అమ్మకాలు సాగిస్తున్నారని వైన్ షాపుల నిర్వాహకులతో మందుబాబులు వాదనకు దిగుతున్నారు. వైన్స్ షాపులలో పెంచిన ధరల కంటే మరింత అదనంగా డబ్బులను వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments