Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో తగ్గిన కరోనా కేసులు... దేశంలో నాలుగోస్థానంలో ఆంధ్రప్రదేశ్

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (13:49 IST)
అందమైన సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో మొత్తం 20 కేసులు నమోదు కాగా, వీటిలో 10 కేసులు యాక్టివ్ కేసులు. ప్రస్తుత ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గిందని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. 
 
ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున విశాఖలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖలో కరోనా విస్తరణ తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఏది ఏమైనా ఈ కరోనా మహమ్మారిని అందరం కలసికట్టుగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని గుర్తు చేశారు. 
 
ఇలాంటి క్లిష్ట సమయంలోనే కరోనా బాధితులకు అండగా నిలబడాలని ఆదేశించారని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్ల ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తం కొరత లేకుండా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విన్నవించారు.
 
మరోవైపు, కరోనా వైరస్‌ పరీక్షల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది.  ప్రతి పది లక్షల మందికి సగటున చేస్తున్న పరీక్షల్లో ముందంజలో ఉంది. దేశంలో సగటున 10 లక్షల మందికి 198 పరీక్షలు చేస్తుంటే.. ఏపీలో 331 టెస్టులు చేస్తున్నారని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. రాష్ట్రంలో రోజుకు 3వేలకు పైగా పరీక్షలు చేస్తున్నారని, ఇప్పటివరకు మొత్తంగా 16,550 మందికి పరీక్షలు నిర్వహించారని తెలిపింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments